ఆహా యెంతటి శ్రమలఁ బొందితి

aahaa yentati shramalan bonditi

🎵 AKK-190💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో దాహ మాయెను నీకు సిల్వపై ద్రోహు లందరు గూడి రయ్యయ్యో నీదు దేహంబు బాధించి రయ్యయ్యో ||ఆహా యెంతటి||

1వ చరణం

దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా ||ఆహా యెంతటి||

2వ చరణం

కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా ||ఆహా యెంతటి||

3వ చరణం

కాలుసేతులయందు వారలు ఇనుప చీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి సుమంతైన జూపక వారు గేలిజేయుచు బాధపెట్టిరా ||ఆహా యెంతటి||

4వ చరణం

బాధ తగ్గింపరాణువవారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనస్సు దానినొల్లక గొప్ప వేదనలను భరియించెనే ||ఆహా యెంతటి||

Report Error