చూడరే సిలువను వ్రే లాడు

choodaree siluvanu vree laadu

🎵 AKK-193💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు జెందెఁ గదా ||చూడరే సిలువను||

1వ చరణం

నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే సిలువను||

2వ చరణం

దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యో ముండ్ల కిరీటమై ||చూడరే సిలువను||

3వ చరణం

పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో మేకులు ||చూడరే సిలువను||

4వ చరణం

పాపేచ్ఛ తోడఁ గూడు నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని బెల్లంపు పోటులు ||చూడరే సిలువను||

Report Error