ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు

ennandu gaanchedamoo yeesuni nennandu

🎵 AKK-195💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||ఎన్నఁడు గాంచెదమో||

1వ చరణం

అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||ఎన్నఁడు గాంచెదమో||

2వ చరణం

వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట బల్లెము దూసిరి ప్రక్కనఁట ||ఎన్నఁడు గాంచెదమో||

3వ చరణం

చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ ట మన దగు నేరము గాచెనఁట ||ఎన్నఁడు గాంచెదమో||

4వ చరణం

ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ ట యెహోవా కొడుకై వెలసెనఁట ||ఎన్నఁడు గాంచెదమో||

5వ చరణం

అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||ఎన్నఁడు గాంచెదమో||

Report Error