పల్లవి
సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా ||సిలువే నా||
1వ చరణం
సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా ||సిలువే నా||
2వ చరణం
సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా ||సిలువే నా||
3వ చరణం
సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపఁగఁ జాలును రా ||సిలువే నా||
4వ చరణం
పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను నిలచినాఁడను రా ||సిలువే నా||
5వ చరణం
శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||సిలువే నా||