సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి
sirulella vrudha kaangan parikinchi
పల్లవి
సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి నాకున్న గురువముఁ దిరస్కరింతున్ వెర మహిమ రారాజు మరణాద్భుతపు సిలువ నరయుచున్నట్టి వేళన్ ముఖ్యము లైన ||సిరులెల్ల వృధ||
1వ చరణం
ఓ కర్త నా దేవుఁ డౌ క్రీస్తు మృతియందుఁ గాక మరి మురియ నీయకు ప్రాకట భ్రమకారి వ్యర్ధ వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై త్యజించెదను ||సిరులెల్ల వృధ||
2వ చరణం
చారు మస్తక హస్త పాదములవలన వి చారంబు దయయుఁ గలసి సారెఁ బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి దారి గలదా ముళ్లు తగు కిరీటం బౌన ||సిరులెల్ల వృధ||
3వ చరణం
వాని నిజ రక్తంబు వస్త్రంబువలె సిలువ పై నతని తనువు గప్పె ఐననేనీ లోక మంతటికి మృతుఃడనై తిని నా కీ లోకము మృతంబయ్యె ||సిరులెల్ల వృధ||