కలవరి మెట్టపై కలవర మెట్టిదొ
kalavari mettapai kalavara mettido
పల్లవి
కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ లొందినీ ప్రాణము బెట్టితి ||కలవరి మెట్టపై||
1వ చరణం
తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను గుందితి ||కలవరి మెట్టపై||
2వ చరణం
పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు ||కలవరి మెట్టపై||
3వ చరణం
దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కలవరి మెట్టపై||
4వ చరణం
జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి ||కలవరి మెట్టపై||
5వ చరణం
శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు? ||కలవరి మెట్టపై||