సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్
silvayoddan jeerudun beeda heenayandhundan
పల్లవి
సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్ లోకమున్ త్యజింతును పూర్ణముక్తి నొందుదున్ ||సిల్వయొద్దఁ జేరుదున్||
1వ చరణం
నిన్ నేఁజేరఁ గోరఁగా నన్ను ఁబాయు పాపము శుద్ధిఁజేతునంచును యేసు మాటనిచ్చెను.
2వ చరణం
నన్ను ను నా మిత్రులన్ లోక యాస్తిఁ గాలమున్ దేహయాత్మయంతయు నీకర్పింతునిప్పుడు.
3వ చరణం
యేసుమాట నమ్మెదన్ క్రీస్తు రక్త పుణ్యముఁ జూచి మ్రొక్కి యేసుతో నేను మృతినొందితిన్.
4వ చరణం
యేసు తాను వచ్చును నాకు నిచ్చు పూర్ణతన్ శుద్ధ సౌఖ్య మొందుదున్ జయస్తోత్ర మేసుకు.