హలెలూయ యని పాడుఁడీ సమాధిపై

halelooya yani paadundee samaadhipai

🎵 AKK-217💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును ||హలెలూయ యని||

1వ చరణం

హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక పారిపోయెను గలిబి లాయెను నరకము ||హలెలూయ యని||

2వ చరణం

హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ యని||

3వ చరణం

హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ యని||

4వ చరణం

హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము ||హలెలూయ యని||

5వ చరణం

హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా ||హలెలూయ యని||

6వ చరణం

హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ యని||

7వ చరణం

హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ యని||

8వ చరణం

హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ యని||

9వ చరణం

హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ యని||

Report Error