క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు
kreestu leechenu hallelooya kreestu
క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్నులేపును ఇద్దియె సునాద సత్యము ఇలను చాటుడి నిత్యము ||క్రీస్తు లేచెను||
మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది ||క్రీస్తు లేచెను||
పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము ||క్రీస్తు లేచెను||
మరణమా! నీముల్లు యెక్కడ? మరణమా! జయమెక్కడ? మరణమా! నీముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు ||క్రీస్తు లేచెను||
శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలాయెను రాత్రిలో ఇలయు పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో ||క్రీస్తు లేచెను||
మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము ప్రేతలను జీవింపచేయును పృథివి క్రీస్తుని విజయము ||క్రీస్తు లేచెను||
స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా స్వంత రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి ||క్రీస్తు లేచెను||