క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ

kreestu prabhuni pratyakshatalanu viva

🎵 AKK-223💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ రించెద వినరే ప్రియులార వాస్తవముగ మరణించి బ్రతికెనని వసుధలోఁ బ్రకటింపరె యూరూరఁ ||క్రీస్తు ప్రభుని||

1వ చరణం

మరియ మగ్దలేనెకుఁ బ్రథమంబున మన గురువర్యుం డగపడియెఁ తరుణీమణులకు రెండవ మాఱొక దర్శనము దయతో నిడియెఁ ||క్రీస్తు ప్రభుని||

2వ చరణం

సీమో నను పేతురును గూడ ద ర్శించె నతఁడు మూఁడవ మాఱు ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుఁ బ్రియ మొనరించె మఱొక తీఱు ||క్రీస్తు ప్రభుని||

3వ చరణం

తోమాలేని తరుణమునఁ బదుగురి తో వచించె గృహమునఁ జేరి తోమాకు కనపడి యతని సంశయముఁ దొలఁగించెను బ్రభుఁ డొకసారి ||క్రీస్తు ప్రభుని||

4వ చరణం

సందరంపు దరి నేడుగురికి మ త్స్యంబులు వింతగ సమకూర్చె సందర్శించియు యాకోబునకును సంతోషము నెంతయుఁ గూర్చెఁ ||క్రీస్తు ప్రభుని||

5వ చరణం

ప్రభుఁ డొక మాఱే నూరుగురిఁ దాఁ బ్రత్యక్షుం డయ్యెను పేర్మి నషయ మొసంగి యపొస్తలులకుఁ క్రీ స్తారోహణుఁ డయ్యెను గూర్మిఁ ||క్రీస్తు ప్రభుని||

6వ చరణం

హత్యఁ జేయు నేగెడు తార్సీయున కగపడి రక్షించెను సుమ్ము మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో దృశ్యుం డగు నిది సత్యమ్ము ||క్రీస్తు ప్రభుని||

Report Error