ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి

oohoohoo maa yannalaaraa yudyooginpandi

🎵 AKK-231💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచుఁ క్రీస్తుని దయను గోరండి ||ఓహోహో మా||

1వ చరణం

అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ బోకమునుపే ప్రభువును వేడండి ||ఓహోహో మా||

2వ చరణం

మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు ||ఓహోహో మా||

3వ చరణం

అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును ||ఓహోహో మా||

4వ చరణం

కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్ ||ఓహోహో మా||

5వ చరణం

నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును ||ఓహోహో మా||

6వ చరణం

ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర ||ఓహోహో మా||

7వ చరణం

కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను ||ఓహోహో మా||

8వ చరణం

కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే ||ఓహోహో మా||

9వ చరణం

ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను ||ఓహోహో మా||

10వ చరణం

జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతఁడు ||ఓహోహో మా||

Report Error