కోప దినము వచ్చును పాపుల

koopa dinamu vachchunu paapula

🎵 AKK-232💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కోప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును శ్రీ పాల యేసుని దాపునఁ జేరక మాపు రేపులు మహ పాపులకును గొప్ప ||కోప దినము||

1వ చరణం

భువిలో రాల కర్రల పూజలఁజేయు చవి దేవుండ్లని చెప్పెడి అవిగాక తమవంటి నరులదేవుండ్లని యవివేకముగ నమ్ము నరులందరికి నెంతో ||కోప దినము||

2వ చరణం

నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరి యబద్ధికు లందఱు ఇరుగు పొరుగు వారి నిఁక మోసములు చేయు నరులందఱు చెడ్డ నరకములోఁ బడునట్టి ||కోప దినము||

3వ చరణం

ఆట పాటలవల్లను పాపము చాల వేటాడుకొను వారలు బూట కముల వారలు భువిలో యక్షిణిగాండ్రు మాటలాడక యగ్ని మడుగులో బడి కాలే ||కోప దినము||

4వ చరణం

కులభేదములు గల్పించి కుటిలమందు బలముగ బ్రతుకుచుండు ఇల మాయవాదుల కిఁక నేమి గతిలేక పలుగొరుకులు నుండె బాధల పాలయ్యెడు ||కోప దినము||

5వ చరణం

మీఁది దేవునివలనను యియ్యంబడెడు వేద మొక్కటి సత్యము ఆధారమైయుండు నాత్మరక్షణ కది సాధులైనమ్మని భేదకులకు నెంతో ||కోప దినము||

Report Error