ప్రభు పునరాగమరీతి విను మో

prabhu punaraagamareeti vinu moo

🎵 AKK-235💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ప్రభు పునరాగమరీతి విను మో ప్రభాతగీతి చయ్యన రానయె జ్యోతి సమయంబులేదు ధాత్రి ||ప్రభు పునరాగమరీతి||

1వ చరణం

పవలు పదియురెండు ఘంటలు పాపతమోహేళి భువనంబులు తెల్వి దేల్చి ప్ర బోధ సుప్రభాళి కువలయు త్రాణముకై కడపట కుధర ముపై వ్రాలి చన దవిలిన శోకమున ద్విజాతివి తతి గుండెవిరాళి ||ప్రభు పునరాగమరీతి||

2వ చరణం

గతియించెను సంధ్యచీకటి కారుకొనెంధాటి మతి స్వాస్థ్యము నెడగా క్రీస్తు స మాజప్రజాకోటి క్షితితలాన రాజుప్రభవెలి గెన్నొ కింతపాటి అట మృతిభయంకరంబై వడినడి రేయిపోయెదాటి ||ప్రభు పునరాగమరీతి||

3వ చరణం

తొలి జాముస్తవముజేసె విహంగమ సంఘములలవోక కడు దీమసమున మింట చటుక్కున దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము దెచ్చెవేగ బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ ||ప్రభు పునరాగమరీతి||

Report Error