రాజాధి రాజా రారా రాజులకు
raajaadhi raajaa raaraa raajulaku
పల్లవి
రాజాధి రాజా రారా రాజులకు రాజువై రారా రాజయేసు రాజ్యమేల రారా రవికోటితేజ యేసురారా ||రాజాధి రాజా|| రాజాధి ||రాజాధి రాజా||
1వ చరణం
ఓ...భూజనంబులెల్ల తేరిచూడగా ఓ...నీ జనంబు స్వాగతంబునీయగా నీ రాజ్యస్థాపనంబుసేయ భూరాజులెల్ల గూలిపోవ భూమియాకసంబు మారిపోవ నీ మహా ప్రభావమునవేగ ||రాజాధి రాజా||
2వ చరణం
ఆ...ఆకసమున దూత లార్భటింపగా ఆ ఆదిభక్త సంఘసమేతంబుగా ఆకసంబు మధ్యవీధిలోన ఏకమై మహాసభజేయ యేసునాధ! నీదు మహిమలోన మాకదే మహానందమౌగ ||రాజాధి రాజా||
3వ చరణం
ఓ...పరమ యెరుషలేము పుణ్యసంఘమా ఓ...గొఱియపిల్ల క్రీస్తు పుణ్యసంఘమా పరమదూతలార! భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా! గొఱియపిల్ల యేసురాజుపేర క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి రాజా||