పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా
parishuddhaatma nityaatma parama paavuramaa
పల్లవి
పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా దురతేచ్ఛలను దూర పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ నిత్యాత్మ||
1వ చరణం
నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ సత్యంపు శుభ వార్త సంధించు నాత్మ ||పరిశుద్ధాత్మ నిత్యాత్మ||
2వ చరణం
జీవమార్గంబున జీవింప నేర్పి త్రోవఁ దప్పిన వారి భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ నిత్యాత్మ||
3వ చరణం
పాపాంధకారంబుఁ బాపు నీ వెలుఁగుఁ జూపి మింటికి నడిపి కాపాడి మెలఁగు ||పరిశుద్ధాత్మ నిత్యాత్మ||
4వ చరణం
భక్తుఁడు శోధింపఁ బడుచుండునేని యుక్తిఁ దెల్పెడి సర్వ శక్తి నీదౌను ||పరిశుద్ధాత్మ నిత్యాత్మ||
5వ చరణం
తిన్ననైన తెలివి తేట నాకిమ్ము నిన్ను సేవించెద నిజము స్తోత్రమ్ము ||పరిశుద్ధాత్మ నిత్యాత్మ||