శ్రీ యేసు స్వామి తిరిగి

shree yeesu svaami tirigi

🎵 AKK-240💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబుఁ జేరగా ఒక్కాదరణకర్తను ఒసంగెను.

1వ చరణం

ఆ దేవునాత్మ ప్రీతిగా మదిన్ వసించుచు విధేయులైన మనల పాలించును.

2వ చరణం

సద్గుణ మున్న మనకు ఆ యాత్మ దానము శోధించు దుష్టుని సహా జయించును.

3వ చరణం

ఓ దేవునాత్మ, మమ్మును విశుద్ధిపర్చుము మా హృదయంబులో సదా వసించుము.

Report Error