దివ్య పావనాత్మ, నీ యీవు

divya paavanaatma, nee yeevu

🎵 AKK-241💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దివ్య పావనాత్మ, నీ యీవు లన్ని మంచివి నీదు ముఖ్యదానమీ -దివ్య ప్రేమయే-

1వ చరణం

ప్రేమ దయచూపును ప్రేమ దీర్ఘశాంతము మృతికన్న బలము -దివ్య ప్రేమయే-

2వ చరణం

కాలజ్ఞాన మంతయు కొట్టి వేయబడును ప్రేమ నిత్య ముండును -దివ్య ప్రేమయే-

3వ చరణం

దృష్టిగా విశ్వాసము మాఱఁగా నిరీక్షణ యనుభవమౌఁ గాని -దివ్య ప్రేమయే-

4వ చరణం

విశ్వాస నిరీక్షణ ప్రేమ లీ మూడుండును కాని శ్రేష్ఠమయినది -దివ్య ప్రేమయే-

5వ చరణం

పావనాత్మ! స్తోత్రము నీకుఁ జేయు వారము మాకు దయచేయుము -దివ్య ప్రేమయే-

Report Error