పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు

parishuddhaatmanu goorumu jeevamu yeesu

🎵 AKK-243💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె వేదమునందు ||పరిశుద్ధాత్మను గోరుము||

1వ చరణం

పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును వేగఁ ||పరిశుద్ధాత్మను గోరుము||

2వ చరణం

పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై యుండుఁ ||పరిశుద్ధాత్మను గోరుము||

3వ చరణం

పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని కరుణాధికము వడయఁ ||పరిశుద్ధాత్మను గోరుము||

4వ చరణం

పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితేచ్ఛ లను గొప్ప యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున మమ్ము ||పరిశుద్ధాత్మను గోరుము||

5వ చరణం

పరిశుద్ధాత్మను బొందుట అన్నిటి కన్నఁ ప్రబలంబైన మేలిట నెర నమ్మి మొఱబెట్టు పరమ పావనఁ డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత మగు దనుక ||పరిశుద్ధాత్మను గోరుము||

Report Error