రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము

rammu rammu parishuddhaatmaa rammu

🎵 AKK-245💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము రమ్ము దీవింపఁగ నిమ్ము నీదు కృపను నింపు మా డెందముల్ నెమ్మదిఁ బొందంగ ||రమ్ము రమ్ము||

1వ చరణం

జీవంపు టూటవు ప్రేమ జ్వాల వీవె దేవ దాన మీవె యాద రించువాఁడ ||రమ్ము రమ్ము||

2వ చరణం

దేవహస్త మీవె వరము లన్ని నీవె నీవె తండ్రి వాగ్ధ త్తమ్మయి వెలుగుచుండు ||రమ్ము రమ్ము||

3వ చరణం

మాటలాడు శక్తి నిచ్చి నాయాత్మను మేటిల్ల నను నభి షేకించుమీ దేవ ||రమ్ము రమ్ము||

4వ చరణం

ఇమ్ము నీదు వెలుఁగు నింపు నీ ప్రేమతో కమ్ము నాకుఁ తోడు నన్ను బలపర్చుమా ||రమ్ము రమ్ము||

5వ చరణం

పారదోలు దవ్వు నాత్మ శత్రువుల నిం పార నీదు నెమ్మ దిచ్చి ప్రోవు నన్ను ||రమ్ము రమ్ము||

6వ చరణం

ముందు నీవు నడువ నన్ను డాయ దేది యిందు నన్ను ఁ జెరచు వారు లేరు భువిని ||రమ్ము రమ్ము||

7వ చరణం

జనకుఁ జూపు నాకు నట్లె చూపు సుతుని ననయ మెఱిఁగి దేవ నిను నమ్మి జీవింప ||రమ్ము రమ్ము||

8వ చరణం

జనక సుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవా నిను సన్నుతింపను నీదు దయ నంపుమా ||రమ్ము రమ్ము||

Report Error