పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై
parishuddhaatmaa paavuramaa nee daasulapai
పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదెంచుమా పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి యా దరణకర్తగ నిన్ను దయచేసె గద మాకు ||పరిశుద్ధాత్మా పావురమా||
తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ ||పరిశుద్ధాత్మా పావురమా||
విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి ||పరిశుద్ధాత్మా పావురమా||
సత్యస్వరూపా రమ్ము మమ్ముల సర్వ సత్యములో నడుపుము సత్యాత్మా నీ శక్తి సంపత్తితో దైవ కృత్యము లొనరింప గ్రుమ్మరింపుమా శక్తి ||పరిశుద్ధాత్మా పావురమా||
వాక్యమందలి భావముల్ లోతుగ దరచి వచియింప దరమె మాకు వాక్యోప దేశివిగా వచ్చి మాలో నిలచి వాక్యమందలి జీవ భావాలు దెలుపుమా ||పరిశుద్ధాత్మా పావురమా||
సాధక బాధకముల నిలయంబైన సంసార సాంద్రములో ఆదరణ కర్తవుగా నరుదెంచి మా సర్వ బాధల దొలగించి మోదంబు గూర్చుమా ||పరిశుద్ధాత్మా పావురమా||