రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును

rammu parishuddhaatma deevundaa mammunu

🎵 AKK-249💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస నమ్ముకడకు నెమ్మి నడుపుమా మమ్ము నడుపు దీక్షతోఁబ రమ్ము విడిచి యాత్మస్వరూ పమ్మున నరుదెంచిన దై వమ్ము నీవెకద యెహోవ ||రమ్ము పరిశుద్ధాత్మ||

1వ చరణం

లోకయాత్ర చేయునప్పుడు చీ కాకుపడిన మాకు నీవె మార్గ దర్శివై వీఁక నొసఁగి మాకరంబుఁ జేకొని పరిశ్రమముఁబాపి సిలువఁ బడినవానికడకు త్సేకమూని మమ్ముఁజేర్ప ||రమ్ము పరిశుద్ధాత్మ||

2వ చరణం

భక్తవన వసంతదైవమా నీయందుఁ బ్రేమా సక్తివృద్ధిచేసి మనుపుమా ముక్తిదాత యేసువిభుని రక్తమహిమఁ దెల్పియఘ వి ముక్తులనుగఁజేసి మమ్ము యుక్తమార్గమందు నిలుప ||రమ్ము పరిశుద్ధాత్మ||

3వ చరణం

జీవితపుబాధ లెన్నియో పెనుఁబ్రోవులగుచు నావరించి మమ్ముఁ దా కిన మాకు నీవె హితుఁడవగుచు భావమిచ్చి భయముఁదీర్చి జీవ మైన యేసుపాద సేవకు మముసిద్ధపఱుప ||రమ్ము పరిశుద్ధాత్మ||

4వ చరణం

పలువిధంబులైన చింతలు చెలరేఁగి మమ్ము కలఁతపెట్టు నవసరం బున వలనుచెడిన మామనముల మలయు వ్యాకులతను మాన్పి వలయు నాదరణము నిచ్చు పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము పరిశుద్ధాత్మ||

5వ చరణం

తొలిప్రవక్త లెంద రెందఱో నీ ప్రేరణమునఁ బలికినట్టి వేదమందునఁ గల నిగూఢ భావములను దెలుపు నొజ్జవీవెయగుటఁ దెలిపి వాని మమ్ము జ్ఞాన కలితమతులఁ జేయుకొఱకు ||రమ్ము పరిశుద్ధాత్మ||

6వ చరణం

సడలివాడిపోవుచున్న మా విశ్వాసలతను బలసమృద్ధి నుద్ధరించి మా యెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు లడఁచి ప్రేమఁ జ్యోతిమాలోఁ గడుస్థిరముగ వెలుఁగజేయ ||రమ్ము పరిశుద్ధాత్మ||

7వ చరణం

స్తుతులు నుతులు నీకెచెల్లుఁగా వుత యుగయుగంబు లతులభక్తిని న్నె కొలుతుము క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య మృతికి మృత్యువైనవాని వితతసింహపీఠిపైని ||రమ్ము పరిశుద్ధాత్మ||

Report Error