వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు

vinaree yapoostalula kaaryamul kraistavu

🎵 AKK-251💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను వారి కవి యెంతో ధైర్యముల్ మనసు లొక్కటిఁ జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ చనుదెంచె వారిపై ||వినరే యపోస్తలుల||

1వ చరణం

పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర ముగ వార లం దరుఁ గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై తన్నాదము ||వినరే యపోస్తలుల||

2వ చరణం

అనలార్చులను దీప్తి మించుచు బీఁట లగు జిహ్వల్వలె గనుపించుచు ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వఁ గను బరిశుద్ధాత్మచే తను నింపఁబడి రంత ||వినరే యపోస్తలుల||

3వ చరణం

వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ ||వినరే యపోస్తలుల||

4వ చరణం

ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవునిఁ గొల్చి తా మందరు చూడఁగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని దయచేత ||వినరే యపోస్తలుల||

5వ చరణం

మనము నా రీతిగ గుంపుగాఁ గూడి మన దేవుఁ గొల్వఁగ భూమిలో మనుజుల కాశ్చర్య మగు కార్యములఁ జేయ నొనగూడు మనసు కా నందమును గల్గు ||వినరే యపోస్తలుల||

Report Error