మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు

mammun preeman joochi deevundu

🎵 AKK-256💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగాను లేఖనముల నిచ్చె మాకు భూమిపై ||మమ్ముఁ ప్రేమఁ||

1వ చరణం

మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు మాస్థితి మిగులఁ దేటగ నందులో ||మమ్ముఁ ప్రేమఁ||

2వ చరణం

పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ముఁ ప్రేమఁ||

3వ చరణం

పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు ||మమ్ముఁ ప్రేమఁ||

4వ చరణం

సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా ||మమ్ముఁ ప్రేమఁ||

Report Error