ఎల్ల సోదరు లైక్యత వసియించుట

ella soodaru laikyata vasiyinchuta

🎵 AKK-260💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత మేలు మనోహరము ||ఎల్ల సోదరు||

1వ చరణం

ధరణిలో నహరోను తలనుండి దిగ జారు పరిమళ తైలంబు వలె నద్ది తనరారు ||ఎల్ల సోదరు||

2వ చరణం

వెలయు సీయోను కొం డల పైకి దిగి వచ్చు నల హెర్మోను మంచు వలె నద్ది చెల్వారు ||ఎల్ల సోదరు||

3వ చరణం

తరంతరం బాశీర్వా దము నిత్య జీవంబు స్థిరముగా నందుండ సెల విడెను దేవుండు ||ఎల్ల సోదరు||

4వ చరణం

జనక తన యాత్మకును ఘన మహిమ మగుఁగాక మును పిప్పుడున్ యుగ ముల కగును గా కామేన్ ||ఎల్ల సోదరు||

Report Error