సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో

samakoorchumu tandri kraistava sabhaloo

🎵 AKK-261💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమ ప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధ మున ||సమకూర్చుము తండ్రి||

1వ చరణం

దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁ గూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ ||సమకూర్చుము తండ్రి||

2వ చరణం

యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ దండ్రి నీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై ||సమకూర్చుము తండ్రి||

Report Error