ఓ దయానిలయా! ప్రభువా! మా

oo dayaanilayaa! prabhuvaa! maa

🎵 AKK-277💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న స్వనీతి బలముగాక నీ దయాహృదయంబె నమ్ముచు నీదగు బల్లను జేరఁదెగించితి ||ఓ దయానిలయా!||

1వ చరణం

లేదు యోగ్యత బల్లకు దిగువ లేకిని నేరుకొనఁగనయినన్ మాదుగతిఁ గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి ||ఓ దయానిలయా!||

2వ చరణం

ఓ ప్రభుండా! కావున మా పా పోద్భూతంబగు శారీరాత్మల నీ ప్రియంబగు క్రీస్తుతనువున నెత్తుటఁ బరిశుద్ధంబగునటుల ||ఓ దయానిలయా!||

3వ చరణం

ఆయన మాలోఁబరగను మే మాయనలో జీవింపగను నీ యుగాం తముదాఁ క నేకత నీతో జీవించులాగుననో ||ఓ దయానిలయా!||

4వ చరణం

యుక్తముగా నాయన మాంసమును నోరెముగా భుజియింపను దన దగు రక్తము మేమందఱమును ద్రావను రాగంబడరఁగ దయ చేయుము ప్రభు ||ఓ దయానిలయా!||

Report Error