మానవుఁడవై సకల నరుల మానక

maanavundavai sakala narula maanaka

🎵 AKK-281💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మానవుఁడవై సకల నరుల మానక నా దోషములఁ బాపుటకు బలి యైతివే యేసూ బహు ప్రేమతోడ ||మానవుఁడవై సకల||

1వ చరణం

నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు నియమంబు నిచ్చి ||మానవుఁడవై సకల||

2వ చరణం

నీవె జీవపు రొట్టె వంటివి నీవె జీవ జలంబు వంటివి నిన్ను ననుభ వించుఁడంటివిగా నిజదేవా యేసూ ||మానవుఁడవై సకల||

3వ చరణం

నీ శరీరము రొట్టెవలెనే నిజముగా విరువంగఁబడెనే నిన్నుఁ దిను భాగ్యంబు నిచ్చితివే నా యన్న యేసూ ||మానవుఁడవై సకల||

4వ చరణం

మంచి యూట మించి దండి పంచగాయములలో నుండి నిత్యజీవపు టూటలు జేసితి నీ ప్రేమ నుండి ||మానవుఁడవై సకల||

5వ చరణం

నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుఁడంటివి నీ నిజభక్తితోడ ||మానవుఁడవై సకల||

6వ చరణం

ఎంతో ప్రేమతో బలిగా నైతివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప శ్రీ యేసు దేవా ||మానవుఁడవై సకల||

7వ చరణం

నిత్యబలి యగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ నిజరూప మొంద ||మానవుఁడవై సకల||

8వ చరణం

నేను నీ బలిలోనఁ గలిసి నేను నీతోఁ గలిసి మెలిసి నేను నీవలె నుండఁ జేసితివే నా దివ్య యేసూ ||మానవుఁడవై సకల||

9వ చరణం

నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాపభారములు దిగునే నా దివ్య యేసూ ||మానవుఁడవై సకల||

10వ చరణం

నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే నిజ దేవా యేసూ ||మానవుఁడవై సకల||

11వ చరణం

నీవే నీ చేతులతో నిత్తువు ఈ నీ బలివిందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసూ! యెన్నఁడును మరవను ||మానవుఁడవై సకల||

Report Error