మన యేసు మరణస్మా రణవిందులోఁబాలు

mana yeesu maranasmaa ranavinduloonbaalu

🎵 AKK-282💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మన యేసు మరణస్మా రణవిందులోఁబాలు గొనరండు ప్రియులార వినయమానసులై మన దోష చయమెల్లఁ దనమేన ధరియించు కొనిమనల గావ నా యన పడిన శ్రమలెంచి ||మన యేసు||

1వ చరణం

మరల మన మధ్యకా పరమాత్ముఁడరుదెంచ వఱకాయనను మనము మఱవకుండుటకై స్థిర భక్తి నద్దాని జరిగింపవలెనంచు గురుతరంబగు నాజ్ఞ నెఱపితాఁ జనెఁగాన ||మన యేసు||

2వ చరణం

తినుఁడిది యె నా దివ్య తనువంచు నొక రొట్టి యను వ్రచ్చి ప్రభుఁ డిచ్చె ననుబంధుతతికి ఘన శ్రద్ధదానిఁగై కొని మనము భుజియింప నొన గూడు జిరజీవ మనుమాన మిఁకనేల ||మన యేసు||

3వ చరణం

ఆ రీతి నిజరక్త ధారయై వెలయు ద్రా క్షారసము నిచ్చె నిం పార గొను డనుచుఁ గోరి యా మధుధారఁ గ్రోలిన మనకుక్షి దోరమౌ జీవంపుధార లుద్భవ మొందు ||మన యేసు||

4వ చరణం

ప్రభు భక్తి నెవఁడు దై వభయంబు లేక య నుభవించు వానిక శుభమౌ నా మీఁద విభవంబు దొలఁగురో గభయంబు చేకూరు శుభ మవ్వానికి నెపుడు లభియింపదని తెలిసి ||మన యేసు||

5వ చరణం

మిము మీరె తగురీతి గమనించి పరిశోధ నము చేసికొని మీ పాపము లోప్పుకొనుచు నమితార్తిఁబశాత్తా పముఁబొంది యీ విందు క్రమము బాటింప క్షే మము మీకు సిద్ధించు ||మన యేసు||

6వ చరణం

దురితాంధకార భా స్కరుఁడు సద్గురుఁడేసు పరమవిందున కిది యను ప్రాసంబని యెఱిఁగి ఉరణశాబకరక్త సరి దంతఃపరిపూతాం బరులైసత్కార్యత త్పరులై బంధురమతులై ||మన యేసు||

Report Error