శ్రీ రాజిల్లుచు యేసు క్రీస్తు

shree raajilluchu yeesu kreestu

🎵 AKK-285💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శ్రీ రాజిల్లుచు యేసు క్రీస్తు వేంచేసెను భారతిని జయించి ప్రజాళిన్ బ్రోచును! ఆరాజు శాశ్వితుండు భూరిదయాళుఁడు వీరాగ్రేసరుండాజిన్ విజయ ధ్వజంబదె!

1వ చరణం

ఆ హిమాచలమందు నాటెక్కె మెత్తెను కాహళ ధ్వనియందుఁ గ్రందుకొనెనటన్! సౌహార్థ భావమూని జనాళిన్ బ్రోచుఁగ ఆహా యీ యేసుప్రేమ యాశ్చర్యమైనది!

2వ చరణం

ఆంధ్ర కాశ్మీర వంగ ఆ సేతువాసులు ఆంధ్రప్రాయులైయున్న యరణ్యవాసులున్ బంధ విముక్తలౌచుఁ ప్రభువైన యేసుని బంధుర సేవచేయు వారలయ్యెదరు

3వ చరణం

వీరెల్లఁ క్రీస్తునందు విశ్వాసముంచిన ఆ రాజు వీరిన్ శాశ్వ తానంద సామ్రాజ్య ధౌరేయులన్ గావించు ఔర! యీ వార్తను స్ఫారానందంబుతోడఁ జాటుదు రెవ్వరు!

4వ చరణం

భేరీ తూరారవాది గా రక్షావార్తను దోరంపుఁ గోర్కెఁ జాటు మో దేశ సంఘమా! సౌరభ్యమౌ నీ ప్రేమ సారంబు జూపుము ధీరతన్ యుద్ధమందుఁ బోరాడి గెల్వుము

Report Error