ఇఁక నేమి గతి యున్నది

inka neemi gati yunnadi

🎵 AKK-289💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఇఁక నేమి గతి యున్నది మానవులారా యిఁక నేమి గతి యున్నది పాపులకోస మిఁక నేమి గతి యున్నది యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ డుర్వి లేఁడని ముందె ప్రకటించి దావీదు పల్కె వేదము నందు ||ఇఁక నేమి||

1వ చరణం

ఇల రక్షకుఁడు లేమిని గొఱ్ఱెల మంద లిలఁ జెల్ల చెదు రాయెను పులులఁ బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప జాలరు ||ఇఁక నేమి||

2వ చరణం

దురితము లణఁగింపఁగఁ బాపుల నెల్ల దరిఁ జేర్చి బ్రతికింపగ పర మేశ్వరుఁడు తన వరపుత్రుఁ డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణుఁ జొరకయున్న ||ఇఁక నేమి||

Report Error