నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ
nijamugaan parishuddhu dokan dee
నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై లేఁడు వృజినములచేఁ జెడిన మదిని బ విత్రమూలం బెటుల బొడమును ||నిజముగాఁ పరిశుద్ధు||
దురిత లతలకు మూలకందము దుస్స్వభావము దానిఁ గూడిన నరులలోఁ బరిశుద్ధ విధు లె న్నటికిఁ గనరావు నెరవుగా సద్ధర్మములనే తెఱఁగుననుఁ గావింప నేర్తురు ధరణి లోపల ముసిఁడి చెట్టున చెఱకు రస ముండునె తలంపగ ||నిజముగాఁ పరిశుద్ధు||
మనసు క్రియ లన్నిటికి మూలం బనుచు శాస్త్రము పల్కు మఱి యా మనసు శుచిగాకున్న నగునే తనకు క్రియాశుద్ధి అనిశ మా హృదయము దురిచ్ఛల నలరి మిధ్యాసక్తి నుండఁగ ఘనతగల సత్యార్య ముల నిల మనుజుఁడె ట్లొ నరింపఁజాలును ||నిజముగాఁ పరిశుద్ధు||
నిరతమును పాపాగ్నిచేతను గరగుచున్న మనంబులోపల పరమ ధర్మము భక్తి ఎటువలెఁ బాదుకొని యుండున్ నిరపరాధి యొకండు లేఁ డని నిక్కముగఁ గనపచ్చుచున్నది పరమ దేవుఁడు క్రీస్తు కృతమునఁ పాపులను రక్షింపవలయును ||నిజముగాఁ పరిశుద్ధు||