పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి
pooyenga pooyenga kaalamu velli
పల్లవి
పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ పోయెఁగ మాయ సంసార సం పదఁ గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయెఁ దరిగి ||పోయెఁగ పోయెఁగ||
1వ చరణం
ఇలలో నెందరు నీతో నీడైనవారు కలఁ గాంచి మేల్కొన్న గతి మడసినారు ||పోయెఁగ పోయెఁగ||
2వ చరణం
జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు గొయ్యి వెదకు ||పోయెఁగ పోయెఁగ||
3వ చరణం
ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాఁడె కాటి పాలౌను ||పోయెఁగ పోయెఁగ||
4వ చరణం
మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు కొన్నావు ||పోయెఁగ పోయెఁగ||
5వ చరణం
చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు గానంగలేవ ||పోయెఁగ పోయెఁగ||
6వ చరణం
జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు ||పోయెఁగ పోయెఁగ||