వినరే యేసుక్రీస్తు బోధ మదిని
vinaree yeesukreestu boodha madini
పల్లవి
వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప భాగ్యంబులు ||వినరే యేసుక్రీస్తు||
1వ చరణం
దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి యేసువు తెల్పె ||వినరే యేసుక్రీస్తు||
2వ చరణం
మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ దన ప్రాణమర్పించి ||వినరే యేసుక్రీస్తు||
3వ చరణం
మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు మైత్రిని దలఁచుచు ||వినరే యేసుక్రీస్తు||
4వ చరణం
తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున నెమ్మది ||వినరే యేసుక్రీస్తు||
5వ చరణం
తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును తగిన సహాయ్యంబు ||వినరే యేసుక్రీస్తు||