రండి మానవులారా రక్షకునిన మ్మండి

randi maanavulaaraa rakshakunina mmandi

🎵 AKK-305💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము ప్రియులారా రండి పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను ||రండి మానవులారా||

1వ చరణం

ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు ||రండి మానవులారా||

2వ చరణం

పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును ||రండి మానవులారా||

3వ చరణం

పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు జేసిన పాపభారము దీసి శాంతిని గూర్చు యా ప్రభు నొద్దకిపుడే ||రండి మానవులారా||

4వ చరణం

భావమందున దెలియుడి మీరలు నిత్య జీవమార్గము గనుడీ పావ నుండగు క్రీస్తు మిమ్మును పావనులుగా జేసి నూతన జీవము నొసంగి పర మున జేర్చు మిమ్మును నిశ్చయముగా ||రండి మానవులారా||

Report Error