పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము

paapinineenani prabhupadamulakada praarthana seeyumu

🎵 AKK-306💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా పాపుల మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా ||పాపినినేనని ప్రభుపదములకడ||

1వ చరణం

నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా ||పాపినినేనని ప్రభుపదములకడ||

2వ చరణం

జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా నెపముల జెప్పెడు అపవాదిని విడి కృపవాదినిగని బ్రతుకో మనసా ||పాపినినేనని ప్రభుపదములకడ||

3వ చరణం

మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా ||పాపినినేనని ప్రభుపదములకడ||

4వ చరణం

మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా మరణ బంధముల బరిమార్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా ||పాపినినేనని ప్రభుపదములకడ||

5వ చరణం

మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు ఓ మనసా తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా ||పాపినినేనని ప్రభుపదములకడ||

Report Error