హే ప్రభుయేసు హే ప్రభు

hee prabhuyeesu hee prabhu

🎵 AKK-307💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా, శాంతికరా ||హే ప్రభుయేసు||

1వ చరణం

శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా, జీవనదీపా శాంతి సువార్తనిధీ ||హే ప్రభుయేసు||

2వ చరణం

తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా ||హే ప్రభుయేసు||

3వ చరణం

మతములు వెదకిన నిన్నెగదా వ్రతములు గోరిన నిన్నెగదా పతి తులు దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా ||హే ప్రభుయేసు||

4వ చరణం

పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా మలమల మాడిన మానవహృదయము కలకలాడెకదా ||హే ప్రభుయేసు||

5వ చరణం

కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వపతాకము దానము జేసెగదా ||హే ప్రభుయేసు||

6వ చరణం

దేవుని బాసిన లోకములో చావుయె కాపురముండెగదా దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా ||హే ప్రభుయేసు||

7వ చరణం

పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండెగదా దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి వీవెగదా ||హే ప్రభుయేసు||

8వ చరణం

ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవెగదా ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా ||హే ప్రభుయేసు||

9వ చరణం

కలువరిలో నీ శాంతి సుధా సెలయేఱుగ బ్రవహించెగదా కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా ||హే ప్రభుయేసు||

Report Error