దేవ! దీనపాపిని ఓ పావన

deeva! deenapaapini oo paavana

🎵 AKK-314💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత ||దేవ! దీనపాపిని||

1వ చరణం

ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు జేయవె తండ్రీ! ||దేవ! దీనపాపిని||

2వ చరణం

నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని ||దేవ! దీనపాపిని||

3వ చరణం

నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను ద్రుంచుచున్నది ||దేవ! దీనపాపిని||

4వ చరణం

పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది తల్లి ||దేవ! దీనపాపిని||

5వ చరణం

ఎదయందు సత్యంబే యెడఁగోరు చుందువు హృదయమందున జ్ఞాన మొదవ జేతువు నాకు ||దేవ! దీనపాపిని||

6వ చరణం

కలిగించు నాలో ని ర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున ||దేవ! దీనపాపిని||

7వ చరణం

త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ శుద్ధాత్మను నాలో ||దేవ! దీనపాపిని||

8వ చరణం

నీ రక్షణానంద మో రక్షకా మరల చేరదీసి యిచ్చి స్థిరపరచు నా మనసు ||దేవ! దీనపాపిని||

9వ చరణం

కావవే కర్తార క్తాపరాధమునుండి కావు నే నుత్సాహ గానంబుఁ జేసెద ||దేవ! దీనపాపిని||

10వ చరణం

ప్రభువ! నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా విభవముగఁ గొనియాడ విప్పు నా పెదవులను ||దేవ! దీనపాపిని||

11వ చరణం

కోరువాఁడవు కావీ వారయ నర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు నీకు ||దేవ! దీనపాపిని||

12వ చరణం

విఱిగిన మనసే నీ విలసిత యర్పణము అరయ నలిగిన హృదయ మతి ప్రియంబౌ నీకు ||దేవ! దీనపాపిని||

Report Error