పాపినయ్యా నేఁ బాపి నయ్యా
paapinayyaa neen baapi nayyaa
పల్లవి
పాపినయ్యా నేఁ బాపి నయ్యా కాపాడ వయ్యా పాపభారము నుండి పాపు మయ్యా నన్నుఁ పాపభారమునుండి పాపు మయ్యా ||పాపినయ్యా నేఁ||
1వ చరణం
కాపుమయ్యా ననుఁ గావు మయ్య నా పావ నయ్యా జీవమైన యేసు నీ వే నయ్యా నా జీవమైన యేసు నీవే నయ్యా ||పాపినయ్యా నేఁ||
2వ చరణం
ప్రాపు నీవు నా ప్రాపు నీవు న న్నోపినావు నా పాలిదైవమా నన్ను ఁ గావు మో నా పాలి దైవమా నన్ను ఁ గావు ||పాపినయ్యా నేఁ||
3వ చరణం
ఏల వయ్యా న న్నేల వయ్యా మేలియ్య వయ్యా చాల నమ్మితిఁ గరుణా శాలి వయ్యా నేఁ జాల నమ్మతిఁ గరుణా శాలి వయ్యా ||పాపినయ్యా నేఁ||
4వ చరణం
మంటివాఁడ నే మంటివాఁడ న న్నొంటి వీడ కె న్నంటి కైన ని న్నంటువాఁడ నే నె న్నంటికైన ని న్నంటువాఁడ ||పాపినయ్యా నేఁ||
5వ చరణం
శాంతివాఁడ నను శాంతిపరచు నీ శాంత మిడుచు నా సొంత మగు దనుక చెంత నునుచు నే నా సాంత మగు దనుక చెంత నునుచు ||పాపినయ్యా నేఁ||