ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి

aadarinpumu yeesuvaa ni nnaashrayinchiti

🎵 AKK-321💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్ ||ఆదరింపుము యేసువా||

1వ చరణం

నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా

2వ చరణం

సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు లొసగుము నీతి నిధుల సజీవుడా ||ఆదరింపుము యేసువా||

3వ చరణం

ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి నా ప ద్బాంధవ విడిపించుమా ||ఆదరింపుము యేసువా||

4వ చరణం

పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా మొరను గైకొని కలుషముల నెడబాపవే ||ఆదరింపుము యేసువా||

5వ చరణం

పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా ||ఆదరింపుము యేసువా||

Report Error