శరణు నా యేసు ప్రభువా

sharanu naa yeesu prabhuvaa

🎵 AKK-322💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శరణు నా యేసు ప్రభువా నీవెగా పరలోకమునకుఁ ద్రోవ కరుణతో నన్నుఁ గావ నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా ||శరణు నా||

1వ చరణం

పర సుఖము విడిచినావు కన్యక మరియగర్భమున నీవు ధరణి నుదయించినావు నీ కన్న దాత యెవ్వఁడు యేసువా ||శరణు నా||

2వ చరణం

పాపభారము క్రిందను బడి యున్న పాపాత్ములను నెల్లను జేఁపట్టి రక్షింపఁగా నీ కన్న శ్రేష్ఠుఁ డెవ్వఁడు యేసువా ||శరణు నా||

3వ చరణం

మరణమై లేచినావు జీవింప మార్గంబుఁ జూపినావు పరమహిమ జూపినావు నీ కన్నఁ ప్రభుఁ డెవ్వఁడు యేసువా ||శరణు నా||

Report Error