తన యక్రమములకు క్షమా పణ
tana yakramamulaku kshamaa pana
తన యక్రమములకు క్షమా పణ నొందినవాఁడు తన పాప ములకు బ్రాయశ్చిత్తము బును బొందినవాఁడును ధణ్యుండౌ ||తన యక్రమములకు||
దేవుని చేత ని ర్తోషిగఁ దీర్చఁ బడిన వాఁడు భావంబున లేశం బయినను గ పటము లేనివాఁడును ధన్యుండౌ ||తన యక్రమములకు||
మునునేని మౌని నై దిన దినమున నేనొనం చిన నా యార్త ధ్వనిచే క్షీణిం చెను నా యెముకలు సకలం బకటా ||తన యక్రమములకు||
రేయి పగలు నా మీఁ దను నీ చేయి భారమయ్యెఁ గాయము నందలి సారము వేసవి కాలంబున నెండిన విధ మాయెను ||తన యక్రమములకు||
కప్పుకొనకయే నీ యెదుటఁ గలుష మెప్పుకొంటి నొప్పుకొందు ననుకొంటి నక్రమ మోర్పుతోడఁ బాపము మన్నించితి ||తన యక్రమములకు||
కావున నీ సంద ర్శనపుఁ గాలమందు భక్తుల్ భావము రంజిల నినుఁ బ్రార్థింత్రు ప్ర వాహంబులు వారలపైఁ బొరలవు ||తన యక్రమములకు||
దాగు చోటు నీవే శ్రమలను దప్పించెద వీవే వేగ విమోచన గానంబులతో విడువక నీవే యావరించెదవు ||తన యక్రమములకు||
నీ కుపదేశింతు మార్గము నీకును బోధింతు నీ కాలోచన నేఁ జెప్పె దను నీ మీఁదను దృష్టించి సతంబు,ను ||తన యక్రమములకు||
జ్ఞానము లేనట్టి గుఱ్ఱమ ట్లైనను ఖరమువలె నైనను మీరుండకుఁ డని కళ్లెము తో నెంతో బిగియింపఁబడవలెఁ ||తన యక్రమములకు||
కలుగు ననేకములౌ వేద నలు కడు భక్తి విహీ నులకు నమిత కృప దేవుని విశ్వా సులఁ జుట్టుకొని యుండు నిజంబుగ ||తన యక్రమములకు||
సంతోషించుఁడి నీతి మంతులార సత్య స్వాంతులారా మీరంద ఱత్యంత సంతోషంబున గానముఁ జేయుడి ||తన యక్రమములకు||
జనక తనయ పరిశు ద్ధాత్మ కును మహిమము గల్గు మును పిప్పుడు నెల్లప్పుడు యుగముగ ములకును దనరారును గాకామేన్ ||తన యక్రమములకు||