యేసుఁడు రాఁగన్ జేసిన దోషము

yeesundu raangan jeesina dooshamu

🎵 AKK-338💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశన మాయెన్ ||యేసుఁడు రాఁగన్||

1వ చరణం

చింతలు పోయెన్ వింతగ నాకున్ జెంతకుఁ జేర్పఁగ సంతస మాయెన్ ||యేసుఁడు రాఁగన్||

2వ చరణం

సిలువను మోసెన్ గలువరి మెట్టన్ చెలువుగఁ బాపపు బలువును దించెన్ ||యేసుఁడు రాఁగన్||

3వ చరణం

శిరమున ముండ్లున్ గరమున మేకులున్ స్థిరముగ నాటఁగ బరమును జూపెన్ ||యేసుఁడు రాఁగన్||

4వ చరణం

పదముల మేకులున్ జెదరఁగ రక్తము ఎద నిఁకఁ బ్రేమతో ముదము నొసంగెన్ ||యేసుఁడు రాఁగన్||

5వ చరణం

రక్షణ జూపెన్ దక్షుఁడు నాకున్ పక్షముతో నిఁక మోక్షము జూపెన్ ||యేసుఁడు రాఁగన్||

6వ చరణం

రక్తిగ వేఁడన్ శక్తి నొసంగెన్ రక్తము జల్లియు ముక్తిని జూపెన్ ||యేసుఁడు రాఁగన్||

7వ చరణం

గురువును నమ్ముదున్ భారము వెడలెన్ ధీరునిఁ జేయుచు దారిని జూపెన్ ||యేసుఁడు రాఁగన్||

Report Error