ఎంత పాపి నైనను యేసు

enta paapi nainanu yeesu

🎵 AKK-339💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంతటఁ జాటించుఁడి ||ఎంత పాపి||

1వ చరణం

మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైనఁ దా నిచ్చి చేర్చుకొనును.

2వ చరణం

తన దివ్య సిల్వచేఁ దీసి పాప శాపమున్ నన్ బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను

3వ చరణం

ఘోర పాపి నైనను నన్ను ఁ జేర్చుకొనును పూర్ణశుద్ధి నిచ్చును స్వర్గమందుఁ జేర్చును

Report Error