సిల్వ చెంత నేసువా చేర్చి

silva chenta neesuvaa cheerchi

🎵 AKK-340💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సిల్వ చెంత నేసువా చేర్చి నన్ను నుంచు కల్వరిన్ స్రవించెడు కల్వలో నన్నుంచు. ||సిల్వ చెంత||

1వ చరణం

కంపితాత్ము నంధునై కానలేక యుండ సొంపు మీరఁ బ్రోచితి సూర్యతేజ స్కుండ

2వ చరణం

దేవ గొఱ్ఱె పిల్ల ఈన దీప్తి నాకుఁ జూపు నీ వధా ప్రభావముల్ పావనుండ నేర్పు.

3వ చరణం

నే నిరీక్షణంబుతో నెప్డు వేచి యుందున్ భూ నితాంత వారధిన్ బూని యీది మందున్

Report Error