నాకై చీల్చఁబడ్డ యో నా

naakai cheelchanbadda yoo naa

🎵 AKK-342💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నాకై చీల్చఁబడ్డ యో నా యనంత నగమా నిన్ను డాగి యందునఁ చెను మీరఁ బారెడు రక్త జలధారలా సక్తిఁ గ్రోలఁగా నిమ్ము.

1వ చరణం

నేను నాదు శక్తిచే నిన్నుఁ గొల్లఁజాలను కాల మెల్ల నేడ్చినన్ వేల క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనె బాపఁజాలను.

2వ చరణం

వట్టి చేయి చాఁచుచున్ ముట్టి సిల్వఁ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్కఁ జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాధ, పాపము.

3వ చరణం

ఈ ధరిత్రియందున నేఱు దాఁటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చఁబడ్డయో నా యనంత శైలమా నన్ను ఁ జేరఁ దీయుమా

Report Error