ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు
immaanuyeelu raktamu inpaina yootagu
పల్లవి
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును ||ఇమ్మానుయేలు రక్తము||
1వ చరణం
ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధుఁ డాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదు.
2వ చరణం
నీ యొక్క పాప మట్టిదే నిర్మూల మౌటకు రక్షించు గొఱ్ఱె పిల్ల? నీ రక్తంబె చాలును.
3వ చరణం
నా నాధు రక్తమందున నే నమ్మి యుండినన్ నా దేవుని నిండు ప్రేమ నే నిందుఁ జూచెదన్.
4వ చరణం
నా యా యుష్కాల మంతట నా సంతసం బదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన మిద్దియే.