హా! యానంద సుదినము నా

haa! yaananda sudinamu naa

🎵 AKK-345💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

హా! యానంద సుదినము నా యేసున్ నమ్ము దినము ప్రయాస మెల్ల బోయిన దయా రక్షణ దినము. ||హా! యానంద||

1వ చరణం

ప్రభునితో నిరంతమౌ నిబంధనఁ జేసికొంటి నేఁబుట్టితి నింపొందఁగ విభుని పాదపద్మము.

2వ చరణం

నా యాత్మ, శాంత మొందుము నీ యేసె నీ యాధారము భయంబు లేక రక్షణన్ పాలిభాగంబు పొందుము.

3వ చరణం

నే నేసువాఁడ నేసుఁడు నిత్యంబు నా వాఁ డాయెను ఇదెంత గొప్ప భాగ్యము నేనేసు యొక్క మిత్రుఁడన్

4వ చరణం

నేఁ జేసెడి యొప్పందము ఎల్లడ నెఱవేర్తును నేఁ జచ్చు వేళయందును నీ దయ మెచ్చి పాడుదు.

Report Error