నేను క్రీస్తు ప్రభుని జేరి

neenu kreestu prabhuni jeeri

🎵 AKK-353💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నేను క్రీస్తు ప్రభుని జేరి నేను క్రీస్తువాడ నౌదు నేను క్రీస్తు సొత్తు గాన నేను నా సమస్తమును నాధు డేసు కిపుడు యిత్తు ||నేను క్రీస్తు||

1వ చరణం

నేను క్రీస్తు ననుభవించి నేను క్రీస్తు బోలియుందు నేను నా స్వరూపమందు నా ప్రభుండు గానుపింప నేను నేసులో వసింతు ||నేను క్రీస్తు||

2వ చరణం

నేను క్రీస్తునందునుండి నేను క్రీస్తులో బెరుగుదు నేను క్రీస్తు దారినడచి నేను క్రీస్తు మనసు నెపుడు గానుపఱతు నెల్లెడను ||నేను క్రీస్తు||

3వ చరణం

నేను క్రీస్తు సేవజేసి నేను క్రీస్తు సాక్షినౌదు నేను క్రీస్తు సాధ నంబె నేను యనుభవించు రక్ష ణానందంబు జాటెదెపుడు ||నేను క్రీస్తు||

4వ చరణం

నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు నేను, క్రీస్తు కలిసియున్న నాశన తనయుని శక్తి నేలగూలు నద్భుతముగ ||నేను క్రీస్తు||

Report Error