ఇతరుల సాక్ష్యము లెంతో గలిగియున్న
itarula saakshyamu lentoo galigiyunna
పల్లవి
ఇతరుల సాక్ష్యము లెంతో గలిగియున్న మరి సాక్ష్యమే మంచిది మృతిబొందిలేచియు న్నతమోక్ష రాజ్యాధి పతియై యున్న యేసు ప్రభువే మా విభుఁడైన ||ఇతరుల సాక్ష్యము||
1వ చరణం
గురి సిలువ దెస మాకు స్థిరమై నిలిచియున్న దురితము తలయెత్తునే మరి యేసు ప్రక్కలో చొరఁబారి యందున్న కరుణారసము గ్రోలు టెఱిఁగి యుండిన చాలు ||ఇతరుల సాక్ష్యము||
2వ చరణం
తలవాల్చుటకు తనకు స్థలము లే దనునట్టి పలుకే మా కైశ్వర్యము బలమిచ్చి యెదిగించు ప్రభు వాగ్దత్తములే మా కిలలో పంచభక్ష్య ములుగా నుండిన చాలు ||ఇతరుల సాక్ష్యము||
3వ చరణం
బెదిరించి సైతాను కదిలింపలేనట్టి కుదురైన విశ్వాసము బొదలుచు మాలో నిం పొదవుచుండిన చాలు మదిలో నెమ్మది యిచ్చు మా యేసు కృప గల్గ ||ఇతరుల సాక్ష్యము||