నా యాత్మ! లెమ్ము! సిద్ధము

naa yaatma! lemmu! siddhamu

🎵 AKK-364💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా యాత్మ! లెమ్ము! సిద్ధము కమ్ము నా రాజిఁ బూని పాయక పోర వలెను నిజమ్ము వేయి శరంబుల నేయుచు శత్రు వ మేయత నిను పడఁ ద్రోయఁ దెగించెను ||నా యాత్మ!||

1వ చరణం

వేచి ప్రార్థించి యుద్ధము సలుపు వీరాకృతి బోరుము వే జయము కలుగు నని యెంచకుము ఏంచుచుఁ బ్రతిదిన మేసట బోరుచు యా చించి గురు స హాయము బొందుము ||నా యాత్మ!||

2వ చరణం

జయము నొందితి నని తలఁపకుము సౌఖ్యమునకై స మయ మపే క్షించి కూర్చుండకుము నియమిత మకుటము నీ వొందువరకు నిర్భర యుద్ధము నిలువదు నమ్ముము ||నా యాత్మ!||

3వ చరణం

పోరు పోరాడు నిను మరణము దేవుని యొద్దఁ జేరు దనుక వీడకు రణము శ్రీ రమ్యుని ది వ్యారామంబునఁ జేరి సుఖింపఁగఁ జేకొని నిను విను ||నా యాత్మ!||

Report Error